బాంబు డిస్పోజల్ టీంకు శిక్షణ
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:53 PM
: నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో బీడీ (బాంబు డిస్పోజల్) టీంకు రెండు రోజుల కోర్సును ఎస్సీ సునీల్ షెరాన్ బుధవారం ప్రారంభించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో బీడీ (బాంబు డిస్పోజల్) టీంకు రెండు రోజుల కోర్సును ఎస్సీ సునీల్ షెరాన్ బుధవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందులో బీడీ టీం సభ్యులకు ఆధునిక, సాంకేతికతలు, బాంబు డిటెక్షన్, డిస్పోజల్ పద్ధతులపై శిక్షణ, వృత్తి నైపు ణ్యతను పెంచుకోవాలని సూచించారు. వీఐపీలు, వీవీఐపీలు పెద్ద సమా వేశాలు, మత పరమైన కార్యక్రమాల్లో అవాంఛనీయ సంఘటనలు జర గకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, బ్యా గులు తనిఖీ చేసి ప్రజలను కాపాడతామన్నారు. రిజర్వు ఇన్‌స్పెక్టర్లు బాబు, మంజునాథ్, సురేశ్‌బాబు, డిటెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.