Share News

శరీర నిర్మాణం ఇలా..

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:16 AM

మనిషి శరీర నిర్మాణం(అనాటమీ) దినోతవ్సం సందర్భంగా బుధవారం వైద్య విద్యార్థులు బాడీ పెయింటింగ్‌తో ఆకట్టుకున్నారు.

శరీర నిర్మాణం ఇలా..
బాడీ పెయింటింగ్‌తో కర్నూలు మెడికల్‌ కాలేజీ విద్యార్థులు

కేఎంసీలో వైద్య విద్యార్థుల బాడీ పెయింటింగ్‌

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మనిషి శరీర నిర్మాణం(అనాటమీ) దినోతవ్సం సందర్భంగా బుధవారం వైద్య విద్యార్థులు బాడీ పెయింటింగ్‌తో ఆకట్టుకున్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌ డా.కే.చిట్టినరసమ్మ మాట్లాడుతూ శరీర నిర్మాణ శాస్త్రంలో పట్టు సాదిస్తే వైద్యులుగా రాణిస్తారని అన్నారు. ప్రపంచ అనాటమి దినోత్సవం సందర్బంగా బుధవారం న్యూ లెక్చరర్‌ గ్యాలరీలో కార్యక్రమం ఏర్పాటు చేసిన చేశారు. వైద్యులు ముందుగా శరీర నిర్మాణాన్ని తెలుసుకుంటేనే వైద్యరంగంలో ముందుకు వెళ్లవచ్చన్నారు. అనంతరం వైద్య విద్యార్థులు శరీర అంతర్గత నిర్మాణాలను బాడీ పెయింటింగ్స్‌లో చూపిన ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ డా.సాయిసుదీర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.మనోజ్‌ కుమార్‌ పీజీలు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:16 AM