ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోలు కీలకం
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:49 AM
ఎన్నికల ప్రక్రి యలో బీఎల్‌వోల పాత్ర చాలా కీలకమైందని కర్నూలు నియో జకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అన్నారు.
కమిషనర్ రవీంద్రబాబు
కర్నూలు న్యూసిటీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రి యలో బీఎల్‌వోల పాత్ర చాలా కీలకమైందని కర్నూలు నియో జకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అన్నారు. బుధ వారం ఎస్‌బీఐ కాలనీలోని సమావేశ భవనంలో బీఎల్‌వోలకు ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రవీంద్రబాబు మాటా ్లడుతూ ఎన్నికల సంఘం నిబందనలకు అనుగుణంగా బీఎల్‌వోలకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఒక్కరోజు 50 మంది బీఎల్‌వోలకు చొప్పున 250 మందికి శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం 30 మార్కుల పరీక్ష పెట్టి సర్టిఫికెట్ ఇస్తామన్నారు. కార్యక్ర మంలో అర్బన తహసీల్దారు రవికుమార్, డిప్యూటీ తహసీల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూర్ బాషా, ఆర్‌ఐ రాజు, సీనియర్ అసిస్టెంట్ సాధిక్, పాల్గొన్నారు.