నల్ల మట్టినీ వదలడం లేదు..?
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:29 PM
మండలంలోని ఓ బీజేపీ నాయకుడు నేషనల్ హైవే పనుల్లో తలదూర్జి అక్కడి నల్లమ ట్టిని తమ వాహనాల్లో తరలించి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయు. ఆస్పరి ప్రధాన రహదారిలోని పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్నారు.
బరితెగిస్తున్న బీజేపీ నాయకులు
ఆదోని రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ బీజేపీ నాయకుడు నేషనల్ హైవే పనుల్లో తలదూర్జి అక్కడి నల్లమ ట్టిని తమ వాహనాల్లో తరలించి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయు. ఆస్పరి ప్రధాన రహదారిలోని పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారి పనులు చేస్తున్నారు. అయితే ఈ పనుల్లో బీజేపీ నాయకులు తలదూర్జి మట్టి తరలించి, టిప్పర్ రూ.1,500లు, ట్రాక్టర్ రూ.1,000లకు అమ్ముకుంటున్నట్లు సమాచారం..
మా దృష్టికి వచ్చింది
నల్లమట్టిని తమ అవసరాలకు వినియోగిస్తామన్నందుకు బీజేపీ నాయకుడికి అనుమతి ఇచ్చాం. అయితే వారు మట్టిని అమ్ముకుంటున్నారని నా టదృష్టికి వచ్చింది. విచారించి ఇకపై మేమే మట్టిని తరలిస్తాం. - ఉపేంద్ర, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్, ఆదోని
వాహనాలను సీజ్ చేస్తాం
జాతీయ రహదారి పనుల్లో ఇతరుల జోక్యం సహించం, ప్రభుత్వ స్థలంలో నల్లమట్టి తవ్వకాలు ఎలా చేస్తారు. అలా తరలించేవారిపై చర్యలు తీసుకుని, జరిమాన విధిస్తాం, వాహనాలను సీజ్ చేస్తాం.- మౌర్య భరద్వాజ్, సబ్ కలెక్టర్, ఆదోని