బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:21 AM
భారతీయ జనతా పార్టీ బలోపే తానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు.
జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు
బేతంచెర్ల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ బలోపే తానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. గురువారం పట్టణంలో బీజేపీ మండల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అభిరుచి మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథ కాలు అందిస్తుందని, ఈ పథకాల గురించి ప్రతి కార్యకర్త తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సందు వెంకట రమణ, నాగమోహన, బండి కిరణ్, మధు మోహన రెడ్డి, ఆంజనే యులు, ఎస్‌వీ రమణ, నాగమోహన రెడ్డి, పలుకూరు మోహన రెడ్డి, ఆర్‌ఎఎస్‌ఎస్ నాయకుడు నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.