Share News

జన్మదిన వారోత్సవాలు అభినందనీయం

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:28 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వజ్రోత్సవాన్ని టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజులు నిర్వహిం చడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

  జన్మదిన వారోత్సవాలు అభినందనీయం
కరపత్రాలు విడుదల చేస్తున్న మంత్రి టీజీ భరత్‌

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వజ్రోత్సవాన్ని టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజులు నిర్వహిం చడం అభినందనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శనివారం మౌర్యఇన్‌లోని ఆయన కార్యాలయంలో వజ్రోత్సవ కరపత్రాలు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్‌ మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం నుంచి వారం రోజుల పాటూ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవ వారోత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందులో అష్టావధానం మొదలు పౌరాణిక, సాంఘిక నాటకాలు, నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కళాకారులకు ప్రోత్సాహ కరమని చెప్పారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్‌ ఈ కార్యక్రమానికి చేయూత ఇస్తున్నారన్నారు. వివిధ రంగాలకు చెందిన నిపు ణులతో పాటూ ఇటీవల కందుకూరి పురస్కార గ్రహీతలకు ప్రతిరోజూ సత్కారం ఉంటుందన్నారు. సాహిత్య, సంగీత, నాటక అభిమానులతో పాటు సీఎం అభిమానులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం సాయంత్రం నుంచీ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచీ కార్యక్రమాలు మొదలవుతాయని వివరించారు.

Updated Date - Apr 20 , 2025 | 12:28 AM