Share News

బయో మైనింగ్‌ త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 09 , 2025 | 12:37 AM

కర్నూలు మండలంలోని గార్గేయపురం డంప్‌యార్డులో ప్రారంభమైన బయో మైనింగ్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కార్పొరేషన కమిషనర్‌ రవీంద్రబాబు ఆదేశిం చారు.

బయో మైనింగ్‌ త్వరగా పూర్తి చేయాలి
డంప్‌ యార్డును పరిశీలిస్తున్న కమిషనర్‌ రవీంద్రబాబు

కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, మే 8(ఆంధ్రజ్యోతి): కర్నూలు మండలంలోని గార్గేయపురం డంప్‌యార్డులో ప్రారంభమైన బయో మైనింగ్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కార్పొరేషన కమిషనర్‌ రవీంద్రబాబు ఆదేశిం చారు. గురువారం డంప్‌యార్డులో బయోమైనింగ్‌ ప్రక్రియను పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డంప్‌ యార్డులో నిల్వ ఉన్న దాదాపు 65 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను రానున్న మూడు నెలల్లోపు బయోమైనింగ్‌ ప్రక్రియ ద్వారా శుద్ధీకరణ చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకు ముందు సెట్కూరు కార్యాలయం వద్ద ఉన్న అన్నక్యాంటీనను కమిషనర్‌ పరిశీలించారు. అనంతరం కొత్తబస్టాండు, గుత్తిపెట్రోలు బంకు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ప్రజారోగ్య అధికారి కె.విశ్వే శ్వరరెడ్డి, డీఈఈ గంగాధర్‌ ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:37 AM