Share News

బయో మైనింగ్‌ పూర్తి చేయాలి: కమిషనర్‌

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:59 AM

గార్గేయపురం డంప్‌ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్‌ ప్రక్రియ వచ్చే నెలాఖరికి పూర్తి చేయాలని కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు అధికారు లను ఆదేశించారు.

బయో మైనింగ్‌ పూర్తి చేయాలి: కమిషనర్‌
డంప్‌యార్డులో మైనింగ్‌ పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, జూన 8(ఆంధ్రజ్యోతి): గార్గేయపురం డంప్‌ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్‌ ప్రక్రియ వచ్చే నెలాఖరికి పూర్తి చేయాలని కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు అధికారు లను ఆదేశించారు. ఆదివారం డంప్‌ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్‌ పనులను ఆయన పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన గార్గేయపురం డంప్‌యార్డులో కొన్నేళ్ల క్రితం బయో మైనింగ్‌ ప్రక్రియ చేపట్టిందన్నారు. డంప్‌యార్డులో 64 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలకు చెత్తా శుద్ధీకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికి 43 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలకు బయో మైనింగ్‌ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. మిగిలిన 22 వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను వచ్చే నెలాఖరికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతకుముందు కమిషనర్‌ నగరంలోని పలు ప్రాంతాలలో పారిశుధ్య పనులను పరిశీలించారు. నగరంలోని ఓ హోటల్‌ వద్ద అపరిశ్రుభంగా ఉండటంలో నిర్వాహకుడిపై అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్‌ వెంట శానిటరీ ఇన్సప్పెక్టర్‌ మల్లికార్జున, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:59 AM