సకాలంలో బిల్లులు చెల్లించాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:37 AM
వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత అధికారులకు సహకరించాలని ఎస్‌ఈ సుధాకర్ కోరారు.
విద్యుత ఎస్‌ఈ సుధాకర్
ఆళ్లగడ్డ, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత అధికారులకు సహకరించాలని ఎస్‌ఈ సుధాకర్ కోరారు. శుక్రవారం ఆళ్లగడ్డ విద్యుత డీఈ ఈ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న బిల్లుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసులు, విద్యుత సిబ్బంది పాల్గొన్నారు.