‘ఉపాధి’ చట్టానికి తూట్లు పొడిచేందుకే బిల్లు: సీపీఎం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:16 AM
ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లు తీసుకుని వచ్చిం దని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత ఆరోపించారు.
డోన రూరల్, డిసెంబరు 19(ఆంధ్రజోతి): ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లు తీసుకుని వచ్చిం దని సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత ఆరోపించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన బిల్లును వ్యతిరేకిస్తూ డోన పాతబస్టాండులో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సీపీ ఎం అనుబంధ సంఘాల నాయకులు రామాంజనేయులు, భాస్కర్ రెడ్డి, మద్దయ్య, చిన్న రెహిమాన, షమీమ్ బేగం, నక్కి హరి పాల్గొన్నారు.
బేతంచెర్ల: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బిల్లును వ్యతిరేకిస్తూ సీపీఎం ఆఽధ్వర్యంలో బేతంచెర్లలో సీపీఎం మండల కార్యదర్శి మధు శేఖర్, నాయకులు ఎల్లయ్య, రామాంజనేయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్పు తగదని అన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు మహాత్మా గాంధీని అవమానిం చడమే అని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజబాబు, నాగరాజు, వెంకటరమణ, వెంకటేష్ నాయక్, గఫార్, సోమనాయుడు, మధు, వెంకట్రామి రెడ్డి, పరశురాముడు, వెంకటేశులు పాల్గొన్నారు.