Share News

ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:07 AM

ద్విచక్రవాహనాల దొంగలపై గోనెగండ్ల పోలీసులు డేగ కన్నువేశారు. గత జూన్‌ 18న రూ. 30లక్షలు విలువ చేసే 35 వాహనాలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేయగా శనివారం మరో ద్విచక్రవాహన దొంగను అరెస్టు చేశారు.

ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు చూపుతున్న పోలీసులు

గోనెగండ్ల, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాల దొంగలపై గోనెగండ్ల పోలీసులు డేగ కన్నువేశారు. గత జూన్‌ 18న రూ. 30లక్షలు విలువ చేసే 35 వాహనాలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేయగా శనివారం మరో ద్విచక్రవాహన దొంగను అరెస్టు చేశారు. దొంగ దగ్గర నుంచి రూ. 5లక్షల విలువ చేసే 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గోనెగండ్ల సీఐ విజయభాస్కర్‌ వివరాల మేరకు.. బెళగల్‌ మండలం పోలుకల్లు గ్రామానికి చెందిన ఉప్పరి వీరేశ్‌ కొంత కాలంగా బస్టాండ్‌, దేవాలయాలు, ఇండ్లముందు, హోటళ్ల ముందు నిలిపిన ద్విచక్రవాహనాలను దొంగలించే వాడు. గత కొంత కాలంగా ద్విచక్రవాహనాలు దొంగ తనం జరుగుతుండటం, అలాగే 6-5-25న గొల్ల మధుశేఖర్‌, 26-9-2024న చంద్రశేఖర్‌ తమ ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని గోనెగండ్ల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో గోనెగండ్ల సీఐ విజయభాస్కర్‌ తన బృందంతో విచారణ చేపట్టాడు. వాహనాల దొంగ బెళగల్‌ మండలం పోలుకల్లు గ్రామానికి చెందిన ఉప్పరి వీరేశ్‌గా గుర్తించారు. దీంతో కొన్ని రోజులుగా పోలీసులు డేగకన్నువేసి అనుసరించారు. శనివారం పథకం ప్రకారం మాటు వేసి గాజులదిన్నె క్రాస్‌ రోడ్డు వద్ద రూ. 5లక్షల విలువ చేసే 4 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాఽధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ విజయభాస్కర్‌ తెలిపారు. ద్విచక్రవాహనాల దొంగను పట్టుకుని వాహనాలను రికవరీ చేయడమే గాకుండా దొంగను పట్టుకోవడంలో చాకచక్యం చూపిన సీఐ విజయభాస్కర్‌, సిబ్బంది దేవరాజు, ఎన్‌టీ కుమార్‌, కార్తీక్‌, మద్దిలేటి, కృష్ణనాయక్‌, మహేంద్ర, డీఎ్‌సపీ భార్గవి అభినందించారు.

Updated Date - Sep 21 , 2025 | 12:07 AM