ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:12 AM
గత ఏడాదిగా పోలీసులుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ద్విచక్ర వాహనాల దొంగను ఎట్టకేలకు గోనెగండ్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
30 వాహనాలు స్వాధీనం
గోనెగండ్ల/కర్నూలు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గత ఏడాదిగా పోలీసులుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ద్విచక్ర వాహనాల దొంగను ఎట్టకేలకు గోనెగండ్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దొంగ దగ్గర నుంచి రూ. 35 లక్షల విలువ చేసే 30 ద్విచక్రవాహనా లను స్వాధీనం చేసుకున్నారు. గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన బజారి కుమారుడు వెంకటేశ్ కూలి పనులు చేసి జీవించేవాడు. విలాసాలు, మద్యానికి బానిసై సులువుగా డబ్బు సంపాదిం చాలనుకొని మొదట్లో చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తర్వాత బస్టాండ్‌లో, ఇండ్ల ముందు, హోటళ్ల ముందు నిలిపిన ద్విచక్రవాహ నాలను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. కర్నూలు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, దేవనకొండ, కోడుమూరు, ఓర్వకల్లు తదితర ప్రాంతాలలో ద్విచక్రవాహనాలను దొంగలించాడు. ఎస్పీ ఆదేశాలతో గోనెగండ్ల సీఐ విజయభాస్కర్ తన బృందంతో విచారణ చేపట్టారు. కొద్ది రోజులుగా పోలీసులు నిఘా పెట్టారు. దొంగ వెంకటేశ్ దొంగతనం చేసిన ద్విచక్రవాహనాలను స్వగ్రామంలోని తన పాడుబడిన ఇంట్లో దాచినట్లు పోలీసులు కనుకొన్నారు. దీంతో బుధవారం పథకం ప్రకారం మాటు వేసి పెద్దమర్రివీడు గ్రామ శివార్లలోని సుంకులమ్మ దేవాలయం దగ్గర వెంకటేశ్‌ను అరెస్టు చేసి, ద్విచక్రవా హనాలను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ విజయ భాస్కర్ తెలిపారు.