Share News

భూమన ఆరోపణలు పచ్చి అబద్ధం

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:43 AM

టీటీడీ ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలు అని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

భూమన ఆరోపణలు పచ్చి అబద్ధం
మాట్లాడుతున్న మల్లెల రాజశేఖర్‌

గోవుల మృతిపై రాజకీయాలా..?

గోశాలకు రండి వాస్తవాలు తేల్చుకుందాం

లడ్డూను కల్తీ చేసిన వ్యక్తులు ఆరోపణలు చేయడం తగదు

టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎస్వీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని మాజీ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలు అని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. శనివారం మండలంలోని హుసేనాపురంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోశాలకు భూమన కరుణాకర్‌రెడ్డి వస్తే వాస్తవాలను పరిశీలిస్తామని, ఎప్పుడు వచ్చేదీ ఆయన చెప్పాలని సవాల్‌ విసిరారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేసేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను అయోమయంలో పడేవిధంగా మతాల మధ్య రెచ్చగొట్టేలా భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గోశాలకు వెళ్లి రికార్డులను చూసి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో కొన్ని గోవులు మరణించిన మాట వాస్తవమేనని, ప్రతి గోశాలలోనూ ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని అన్నారు. వైసీపీ హయాంలో రూ.1100 కోట్లు టీటీడీ నిధులను దారి మళ్లించలేదా అని నిలదీశారు. 2015లో గోపూజ, గో తులాభారంకు తాము నాందీ పలికితే.. ఆ ప్రాజెక్టును పక్కన పెట్టించింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు కేవీ మధు, కాటినేని నారాయణ, వడ్డె నారాయణ, జయకృష్ణ, నాగరాజు, శేఖరప్ప, బజారు, వేణు, గువ్వ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:43 AM