భ్రమరాంబ అతిథి గృహం పరిశీలన
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:14 PM
ఈనెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో శుక్రవారం భ్రమరాంబ అతిథి గృహాన్ని జేసీ విష్ణుచరణ్ పరిశీలించారు.
శ్రీశైలం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఈనెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో శుక్రవారం భ్రమరాంబ అతిథి గృహాన్ని జేసీ విష్ణుచరణ్ పరిశీలించారు. వసతి సదుపాయాలు, గదుల శుభ్రత, ఆహార వసతులు తదితరు అంశాలను అధి కారులను అడిగి తెలుసుకున్నారు. అతిథిగృహం ప్రాంగణంలో పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది డ్యూ టీలు, వంటి అంశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విశిష్ట అతిఽథులకు సౌకర్యవంతంగా ఉం డేలా విద్యుత్, నీటి సరఫరా, భద్రతపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. జేసీ వెంట ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, ఈఈ రామకృష్ణ ఉన్నారు.