Share News

భానుడి భగభగలు

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:51 PM

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌ నెలలోనే ఎండ తీవ్రత అధికమైంది. ప్రజలు పగలు తీవ్రమైన ఎండతో, సాయంత్రం అకాల వర్షాలతోనూ బెంబేలెత్తిపోతున్నారు.

భానుడి భగభగలు

రోజుకు రోజుకూ పెరుగుతున్న ఎండలు

ఉమ్మడి జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఆళ్లగడ్డలో 43.76, కోసిగిలో43.5 డిగ్రీల ఉషోర్ణగత నమోదు

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌ నెలలోనే ఎండ తీవ్రత అధికమైంది. ప్రజలు పగలు తీవ్రమైన ఎండతో, సాయంత్రం అకాల వర్షాలతోనూ బెంబేలెత్తిపోతున్నారు. ఽమంగళవారం ఆళ్లగడ్డలో రికార్డు స్థాయిలో 43.76 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూర్‌లో 43.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కావడంతో వడగాలులు వీచాయి. పాణ్యం మండలం గోనవరంలో 43.34, మంత్రాలయం మండలం వగరూరులో 43.0, కల్లూరు మండలం ఉలిందకొండలో 42.93, గోస్పాడులో 42.83, పాములపాడులో 42.75, బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురంలో 42.7, కర్నూలు పట్టణంలో 42.7, కోడుమూరు మండలం లద్దగిరిలో 42.59, సంజామల మండలం పేరుసోములలో 42.56, శిరువెళ్లలో 42.44, బనగానపల్లె మండలం యాగంటిలో 42.4, దొర్నిపాడులో 42.4, బనగానపల్లె మండలం పాతపాడులో 42.37, పసుపులలో 42.3, కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో 42.26, గడివేములలో 42.09, బనగానపల్లెలో 42.04, డోన్‌లో 42.03, జూపాడుబంగ్లాలో 42.01, నంద్యాల పట్టంలో 42.0, చాగలమర్రి మండలం ముత్యాలపాడులో 41.97, ఓర్వకల్లులో 41.20 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.

Updated Date - Apr 22 , 2025 | 11:52 PM