భక్త కనకదాసు సమతావాది
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:35 PM
భక్త కనకదాసు మంచి గాయకుడు, సమతావాది అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు.
మనుషులంతా ఒకటేనని చాటిన వ్యక్తి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
భక్త కనకదాసుకు ఘన నివాళి
కర్నూలు ఎడ్యుకేషన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): భక్త కనకదాసు మంచి గాయకుడు, సమతావాది అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగ తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో డీబీసీ డబ్లూవో ప్రసూన అధ్యక్షతన భక్త కనకదాసు జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మనుషుల్లో వివిధ కులాలు ఉన్నప్పటికీ.. మనుషు లంతా ఒక్కటేనని చాటిన వ్యక్తి భక్త కనకదాసు అని అన్నారు. తన కీర్తనల ద్వారా భక్తి, సామాజికతత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త అని పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన సం క్షేమ శాఖ సాధికారత ప్రసూన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం భక్త కనకదాసు జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించు కుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకీర్ హుశేన్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీబీవీ సుబ్బయ్య, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు మల్లికార్జున, భాస్కర్, కురువ సంఘం డైరెక్టర్లు శ్రీనివాసులు, గొల్ల సంఘం చైర్మన్ శ్రీనివాసులు, గొర్ల సొసైటీ డైరెక్టర్ మద్దిలేటి, కురువ సంఘం డైరెక్టర్ వెంకట్రాముడు, జిల్లాకురువ సంఘం అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, మహిళా అధ్యక్షరాలు శ్రీలీలమ్మ, కురువ సంఘం నాయకులు పెద్దపాడు ధనుంజయుడు పాల్గొన్నారు.
స్థానిక బీసీ భవనం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన భక్త కనకదాసు విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కురువ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాలులర్పించారు.
సునయన ఆడిటోరియంలో జరిగిన కనకదాసు జయంతోత్సవాల్లో ఏఒక్క ప్రజా ప్రతినిధి హాజరు కాకపోవడం బాధాకరమని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి రంగస్వామి, కోశాధికారి కేసీ నాగన్న, నగర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, బి.రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.