భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం: కలెక్టర్
ABN , Publish Date - May 05 , 2025 | 12:50 AM
: భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో భగీరథ చిత్రపటానికి కలెక్టర్, సగర ఉప్పర సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కర్నూలు కలెక్టరేట్, మే 4 (ఆంధ్రజ్యోతి): భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకమని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో భగీరథ చిత్రపటానికి కలెక్టర్, సగర ఉప్పర సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ కఠోర శ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ మహర్షి నిరూపించారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత లక్ష్యాలను సాధించాలని సూచించారు. వెనుకబడిన తరగతుల వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చేపడుతున్న కార్యాచరణను పూర్తిస్థాయి ఫలాలు వారికి అందేలా నిరంతరం కృషి చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని బీసీలందరూ వినియోగించుకోవాలని సూచించారు. గతంలో తాత్కాలికంగా మూతపడిన హాస్టళ్లను కూడా తిరిగి ప్రారంభించబోతున్నామన్నారు. విద్యార్థులు భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. సమావేశంలో బీసీ వెల్ఫేర్ అధికారి కె.ప్రసూన, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ, డైరెక్టర్ విజయకుమార్, సగర సంఘం అధ్యక్షులు సత్యన్న, సొసైటీ కన్వీనర్ దూదేకొండ కుమార్, జిల్లా గౌరవ ప్రెసిడెంటు డా.గిడ్డయ్య, సగర ఉప్పర సంఘం నాయకులు పాల్గొన్నారు.