క్రికెట్ బెట్టింగ్ జోరు
ABN , Publish Date - May 21 , 2025 | 12:07 AM
ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఆదోని పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా ఐసీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు క్రికెట్ బుకీలను ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆదోనిలో రంగంలోకి దిగిన పోలీసులు
అదుపులో నలుగురు బెట్టింగ్ నిర్వాహకులు?
ఆదోని, మే20 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఆదోని పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా ఐసీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు క్రికెట్ బుకీలను ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల కిందట నలుగురు క్రికెట్ బుకింగ్ అదుపులో ఉంచుకొని వారిని రహస్య ప్రాంతంలో ఉంచి వారి దగ్గర నుండి క్రికెట్ బెట్టింగ్ సంబందించిన మరిన్ని వివరాలతో పాటు వెనుక ఉన్న తిమింగలాలు ఎవరన్న దానిపై సమాచారం రాబడు తున్నట్లు సమాచారం. గతంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బుకీల నుంచి రూ.80లక్షల పట్టుబడ్డాయి. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచల నం సృష్టించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో అప్పటి క్రికెట్ బెట్టింగ్‌తో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడుతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఐజ పట్టణానికి చెందిన మరికొందరిని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో ఎంత మేరకు లావాదేవీలు జరుపు తున్నారు? బుకీలతో ఉన్న ప్రమేయాలపై తమదైన శైలిలో విచారణ జరుపు తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన పార్టీకి చెందిన కీలక నాయకుడి అనుచరుడు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి పేరు బయటకు రాకుండా చూసేందుకు మరో యువ నాయకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్లు సమాచారం. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి ఆదోని పట్టణానికి చెందిన పోలీస్ అధికారితో ప్రస్తావించగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావ డంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తే వివరాలు వెల్లడిస్తామని సమాధానమిచ్చారు.