Share News

మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:47 PM

గ్రామాల్లోని పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ప్రభుత్వ వైద్యులకు సూచించారు.

మెరుగైన వైద్యం అందించాలి
ల్యాబ్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

బేతంచెర్ల, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ప్రభుత్వ వైద్యులకు సూచించారు. శనివారం మండలంలోని ఆర్‌ఎస్‌ రం గాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ల్యాబ్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే కోట్ల స్థలాన్ని పరిశీలించారు. అలాగే మండలం లోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ సచివాలయాన్ని ఆయన పరిశీలిం చారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, వైద్యాధి కారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:47 PM