వర్షంతో పంటకు ఊపిరి
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:31 AM
రెండు రోజులుగా డివిజన్‌లో కురు స్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊపిరి పోశా యి 20 రోజులుగా మొఖం చాటేసిన వర్షాలు మంగళవారం కురియడంతో పత్తి, వేరుశనగ అముదం, ఇతర పంటలు కళకళలాడు తున్నాయి
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 6 (ఆంధ్ర జ్యోతి): రెండు రోజులుగా డివిజన్‌లో కురు స్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊపిరి పోశా యి 20 రోజులుగా మొఖం చాటేసిన వర్షాలు మంగళవారం కురియడంతో పత్తి, వేరుశనగ అముదం, ఇతర పంటలు కళకళలాడు తున్నాయి ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్ద కడుబూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 85,289 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా 60,235 హెక్టార్లలో పత్తి పంట సాగు కాగా, వేరుశనగ 12,255తోపాటు మిగతా ఆముదం, మిరప, ఉల్లి, జొన్న, కంది సాగునట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడొద్దని వ్యవసాయి అధికారుల సూచనలకు మేరకు ఉపయోగించాలని ఏడీఏ బాలవర్దిని రాజు తెలిపారు. వర్షాలు కురడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.