వినియోగదారులకు మెరుగైన సేవలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:26 AM
కర్నూలు జిల్లాలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్.ప్రదీ్‌పకుమార్ అన్నారు.
విద్యుత్ ఎస్‌ఈగా ప్రదీ్‌పకుమార్ బాధ్యతలు
కల్లూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్.ప్రదీ్‌పకుమార్ అన్నారు. సోమవారం ఆయన కర్నూలు జిల్లా విద్యుత్ శాఖ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టారు. కర్నూలు డీపీఈ విభాగం ఈఈగా పనిచేస్తూ ఎస్‌ఈగా పదోన ్నతి పొందిన ప్రదీ్‌పకుమార్‌ను జిల్లా నలుమూలల నుంచి ఇంజనీర్లు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కార్మికల సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పూలబోకేలు, స్వీట్లు అందించి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎస్‌ఈ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. నంద్యాల ఎస్‌ఈ సుధాకర్, ఎస్‌ఏవో చిన్నరాఘవులు, ఏడీఈలు నాగప్రసాద్, శ్రీనివాసులు, శాంతిస్వరూప్ తదితరులు పాల్గొన్నారు.