Share News

హింసకు గురైన మహిళలకు మెరుగైన సేవలు

ABN , Publish Date - May 24 , 2025 | 12:31 AM

హింసకు గురైన మహిళలకు వన్‌స్టాఫ్‌ సెంటర్‌ ద్వారా మెరుగైన సేవలు అందజే యాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

హింసకు గురైన మహిళలకు మెరుగైన సేవలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మే 23 (ఆంధ్రజ్యోతి) : హింసకు గురైన మహిళలకు వన్‌స్టాఫ్‌ సెంటర్‌ ద్వారా మెరుగైన సేవలు అందజే యాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో మిషన్‌ శక్తి సమీకృత మహిళా సాధికారత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ వన్‌స్టాఫ్‌ సెంటర్‌ను 2024ఆగస్టు 1వ తేదీన జిల్లాలో ప్రారంభి ంచినప్పటి నుంచి ఇప్పటివరకు 32 కేసులు నమోద య్యాయన్నారు. కేసుల వివరాలను పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్‌ చేయాలన్నారు. ఆశ్రయం పొందుతున్న మహిళలు కౌన్సెలింగ్‌ పొందిన అనంతరం సంబంధిత స్వస్థలాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ వెంకటశివప్రసాద్‌, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీ తేజేశ్వరి, డీఈఓ జనార్దన్‌రెడ్డి, యువజన సంక్షేమశాఖ అధికారి వేణు గోపాల్‌, జిల్లా ఖజానాశాఖ అధికారి లక్ష్మీదేవి, సోషల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధి కారి చింతామణి, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ జుబేదాబేగం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్‌

నంద్యాల నూనెపల్లె, మే 23 (ఆంధ్రజ్యోతి) : పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 40 పాఠశాలల్లో నిర్మిస్తున్న రసాయన ప్రయోగశాల, ప్లే గ్రౌండ్స్‌, లైబ్రరీ, కిచెన్‌ గార్డెన్స్‌ తదితర నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో పీఎంశ్రీ స్కూల్స్‌ కింద చేపట్టిన నిర్మాణాలపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు సమగ్ర శిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్‌, డీఈవో జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడత కింద 28 పాఠశాలలు, 2వ విడత కింద 12 పాఠశాలల్లో 144 పనులు మంజూరయ్యాయని, ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. పెండింగ్‌లోని నిర్మాణ పనులను జూన్‌ 6నాటికి పూర్తిచేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ర్యాంప్‌ నిర్మాణాలకు మూడు రోజులు, వర్షపు నీటి నిల్వకుంటలు, టాయ్‌లెట్స్‌ను వారం రోజుల్లో నిర్మించే అవకాశం ఉందని, నాణ్యతలో రాజీపడకుండా 15రోజుల్లో పూర్తిచేసేందుకు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:31 AM