Share News

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:56 PM

నంద్యాల సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి
మాట్లాడుతున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

జీజీహెచ్‌ను ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల హాస్పిటల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నంద్యాల సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశించారు. బుధవారం జీజీహెచ్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్‌ రాజకుమారి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. మంత్రి ఫరూక్‌తో పాటు ఎంపీ డా.బైరెడ్డి శబరి, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాల లోపాలు, వైద్యసిబ్బంది కొరత, పారిశుధ్యం, మానవ వనరులు, పరికరాల అవసరం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ జీజీహెచ్‌ను ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా మన్నారు. ఆస్పత్రి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను యుద్ధప్రా తిపదికన పరిష్కరిస్తామని అన్నారు. గతంలో జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు భూమిపూజ చేశామన్నారు. ఆస్పత్రిలో డాక్టర్లు, పారామె డికల్‌ సిబ్బంది కొరతను గుర్తించి భర్తీచేసేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. సిజేరియన్‌ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణకు కొత్త ఏజెన్సీని కేటాయించామని, సెక్యూరిటీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా వచ్చిన నిధులను ఆస్పత్రి అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. ఆస్పత్రిలో అత్యవసర పరికరాల కోసం ఎంపీ ల్యాడ్స్‌ నిధులు వినియోగించుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.మల్లేశ్వరి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సురేఖ, డీసీహెచ్‌ఎ్‌స డా.ఓ.లలిత, సభ్యులు మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌యాదవ్‌, కందుకూరి శ్రీరామమూర్తి, డా.బాబన్‌, టి.మద్దులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 11:56 PM