Share News

పెద్దాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:50 PM

కార్పొరేట్‌ స్థాయిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అంది స్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు.

పెద్దాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
2డీ ఎకో కలర్‌ డాప్లర్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

రూ.61 లక్షల విలువైన 2డీ ఎకో కలర్‌ డాప్లర్‌ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ స్థాయిలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అంది స్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. మంగళవారం సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభా గంలో సీడీఎస్‌ నిధుల కింద రూ.61 లక్షలతో ఏర్పాటు చేసిన 2డీ ఎకో కలర్‌ డాప్లర్‌ను మంత్రి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్డియాక్‌ క్యాత్‌ల్యాబ్‌ను మంత్రి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కులా ఉన్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను 2029 నాటికి కార్పొరేట్‌ స్థాయి హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధికమించి సరికొత్త వైద్యపరికరాలను ఆసుపత్రికి సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ను ప్రారంభిం చడానికి వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ యంత్రం నెలలోపు పిల్లలకు పరీక్షించడానికి ఉపయో గపడుతుందని చెప్పారు. కార్డియాలజీ ప్రొఫెసర్‌ డా.చంద్రశేఖర్‌ మాటా ్లడుతూ 2డీ ఎకో కలర్‌ డాప్లర్‌ మిషన్‌ మెడికల్‌ కాలేజీ డెవలప్మెంట్‌ నిధుల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. చిట్టినరసమ్మ, కార్డియాలజీ ఇన్‌చార్జి హెచ్‌వోడీ డా.లక్ష్మీబాయి, డిప్యూటీ సూపరింటెం డెంట్లు డాక్టర్‌ డి. శ్రీరాములు, డా. సీతారామయ్య, సీఎస్‌ఆర్‌ఎంవో పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 11:50 PM