భక్తులకు మెరుగైన సౌకర్యాలు: ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:19 AM
జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యత, రైతుల జాతరగా పేరుందని, జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
జూపాడుబంగ్లా, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యత, రైతుల జాతరగా పేరుందని, జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. మండలంలోని తర్తూరు గ్రామంలో వెలసిన లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయానికి తాత్కా లిక ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఉత్సవకమిటీ చైర్మన్‌గా తరిగోపుల గ్రామానికి చెందిన మందడి నారాయణరెడ్డి, కమిటీ సభ్యులుగా ప్రభావతమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు, పరమేశ్వరయ్య, వెంకటసుబ్బమ్మ, సుబ్బన్న ఉత్సవాల నిర్వహణకోసం ప్రభుత్వం తాత్కాలిక కమిటీ నియమించింది. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో ఈవో వెంకటరమణ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం దేవాలయ అధికారులు కమిటీసభ్యులకు, ఎమ్మెల్యేకు పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాఽథరెడ్డి, వెంకటేశ్వర్లుయాదవ్, మోహన్ రెడ్డి, శ్రీనివాసులు, రమణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, దొరబాబు రెడ్డి, వెంకటరమణ నాయుడు తదిత రులు పాల్గొన్నారు.