Share News

క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:57 PM

విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు.

క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు
విద్యార్థులకు సూచనలిస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

డీఈవో జనార్దన్‌రెడ్డి

శిరివెళ్ల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. శిరివెళ్లలోని మోడల్‌ స్కూల్‌, కళాశాలను ఆయన శనివారం తనిఖీచేశారు. ముస్తాబు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతిరోజూ చక్కగా ముస్తాబై పాఠశాలకు రావాలని డీఈవో సూచించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. పదో తరగతి విద్యా ర్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మోడల్‌ స్కూల్‌ ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మండల ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ సూర్య నారాయణ, డిప్యూటీ డీఈవో డీటీ శంకర్‌ ప్రసాద్‌, ఎంఈవో-2 నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఇష్రత్‌ బేగం పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 11:57 PM