Share News

పెద్దాసుపత్రిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ఉత్తమ వైద్యం

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:42 PM

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ఉత్తమ వైద్యం అందుబాటులో ఉందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డా.కే.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

పెద్దాసుపత్రిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ఉత్తమ వైద్యం
వైద్యసదస్సులో పాల్గొన్న యురాలజిస్టులు )

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు ఉత్తమ వైద్యం అందుబాటులో ఉందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డా.కే.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం మెడికల్‌ కాలేజీ లెక్చరర్‌ గ్యాలరీలో యురాలజీ విభాగం ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వైద్యవిద్యలో నిరంతరం సాధన అవసరమన్నారు. ప్రొస్పేట్‌ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. యురాలజీ విభాగాధిపతి డా.ముత్యశ్రీ మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రొస్పేట్‌ క్యాన్సర్‌ సాధారంగా మారిందని, సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. యురో అంకాలజిస్టు డా.సేపూరి రవితేజ మాట్లాడుతూ ప్రొస్పేట్‌ క్యాన్సర్‌ ల్యాప్రోస్కోపీ ద్వారా రాయలసీమలోనే మొదటిసారిగా కర్నూలు జీజీహెచ్‌లో చేస్తామన్నారు. హైదరాబాదు అపోలో హాస్పిటల్‌ యురాలజిస్టు డా.సంజయ్‌ అడ్డాల, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డా.కృష్ణ ప్రకాష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శివప్రసాద్‌, సీనియర్‌ యురాలజిస్టులు డా.ఏవీఎస్‌ రెడ్డి, డా.సీతారామయ్య, డా.గోవిందరెడ్డి, పీజీలు పాల్గొన్నారు

Updated Date - Dec 07 , 2025 | 11:42 PM