ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగం
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:52 AM
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పరిపాలన భవనంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు సరస్వతమ్మ, సి.రాంగోపాల్, బసవశేఖర్, మహ్మద్ హక్, ఉద్యోగులు పాల్గొన్నారు.
కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల్లో రాజ్యాంగ దినోత్సవం
విద్యాసంస్థలు, కార్యాలయాల్లో అంబేడ్కర్‌కు నివాళి
కర్నూలు న్యూసిటీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పరిపాలన భవనంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు సరస్వతమ్మ, సి.రాంగోపాల్, బసవశేఖర్, మహ్మద్ హక్, ఉద్యోగులు పాల్గొన్నారు.
నగర పాలక సంస్థ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, కార్పొరేటర్ క్రాంతికుమార్, సూపరింటేండెంట్ రామక్రిష్ణ, మంజూర్‌బాషా, సిబ్బంది శ్రీకాంత్ పాల్గొన్నారు.
పాతబస్టాండు సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పీఎస్. రాధాక్రిష్ణ జి.రామక్రిష్ణ, టి. రాముడు నివాళి అర్పించారు. కేబీపీఎస్ నాయకులు ఎండి. ఆనంద్‌బాబు కరుణాకర్, ఎన్‌జి. కృష్ణ, రోశయ్య, బాబురావు, స్టాలిన్ పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగం దేశానికే తలమానికమని ప్రిన్సిపాల్ నిర్మల అన్నారు. దిన్నెదేవరపాడు అంబేడ్కర్ గురుకులంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. డీసీవో శ్రీదేవి పాల్గొన్నారు. ఎ.క్యాంపు మెపర్ ఫార్మసీ కళాశాలలో అంబేడ్కర్ చిత్రపటానికి చైర్మన్ ఆదిమూలపు సతీష్ నివాళి అర్పించారు. ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, భాస్కర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర జేఏసీ అద్యక్షుడు ఆవుల అయ్యస్వామి, డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శరత్, రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. బి.క్యాంపు ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.నాగస్వామి నాయక్ కేవీఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు రమేష్ , అధ్యాపకులు చిన్న మల్లేశ్వరుడు పాల్గొన్నారు.
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్: భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షక ఇంజనీర్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం కార్యాలయంలో 76వ జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత అంబేధ్కర్ చిత్రపటానికి నివాళి ఆర్పించారు. వీరేంద్రకుమార్, లక్ష్మీనారాయణ, నరసింహులు, కిషోర్‌రెడ్డి, సుధాకర్, నారాయణరావు పాల్గొన్నారు.
కోడుమూరు: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అంబేడ్కర్ చిత్ర పటానికి హెచ్‌ఎం రామచంద్రుడు నివాళి అర్పించారు. ఉపాధ్యాయులు తిరుమలరెడ్డి, జరీనాబేగం, ప్రసన్నజ్యోతి, ఉస్మాన్ సాహెబ్, అనిత, కృష్ణమోహన్, సురేంద్రనాయుడు పాల్గొన్నారు.
కర్నూలు అర్బన్ : అంబేడ్కర్ భవన్‌లో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నగర ఉపాఽధ్యక్షుడు కాశపోగు ఏసన్న నివాళి అర్పించారు. పోతురాజు శివ, బాస్కర్ రావు, రవికుమార్, ప్రకాష్, కిరణ్, సతనయేలు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ వర్శిటీలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వీసీ షావలి ఖాన్., రిజిష్ట్రార్ లోక్ నాథ్ నివాళి అర్పించారు. ఆర్‌యూ అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్‌ఏ, ఆర్పీఎస్‌ఎఫ్ నాయకు లు అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. శరత్ కుమార్, నాగరాజు, నాగార్జున, రాజేష్, అశోక్, మధు నాయక్, కిరణ్ పాల్గొన్నారు.
సి.బెళగల్: ఎంపీడీవో రాణెమ్మ మాట్లాడుతూ దేశ పౌరులంతా రాజ్యంగ ప్రకారం నడుచుకొవాలన్నారు.
ఓర్వకల్లు: నన్నూరు, ఓర్వకల్లు, ఉయ్యాలవాడ, హుశేనాపురం, శకునాల గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. హెచ్‌ఎం నిర్మల వసంత కుమారి, లక్ష్మినారాయణ, శ్యామలమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.