Share News

యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి ఉత్తమ అవార్డు

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:13 AM

పట్టణంలోని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం మూడో సంవత్సరం కూడా ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రంగా ఎంపికైనట్లు యూనిట్‌ హెడ్‌, శాస్త్రవేత్త ధనలక్ష్మి తెలిపారు.

యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి ఉత్తమ అవార్డు
అవార్డు అందుకుంటున్న యూనిట్‌ హెడ్‌ ధనలక్ష్మి

పురస్కారం అందుకున్న శాస్త్రవేత్త ధనలక్ష్మి

బనగానపల్లె, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం మూడో సంవత్సరం కూడా ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రంగా ఎంపికైనట్లు యూనిట్‌ హెడ్‌, శాస్త్రవేత్త ధనలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ సాంకేతిక అనుప్రయోగ సంస్థ, హైదరాబాద్‌ తరుపున 2024-25 సంవత్సరానికి గానూ జోన్లలో గల ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉత్తమ కేవీకేగా యాగంటిపల్లెకు దక్కిందన్నారు. ఈనెల 2 నుంచి 4 వరకు తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్యర్యంలో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 72 కృషి విజ్ఞాన కేంద్రాలు పోటీ పడినట్లు తెలిపారు. ఇందులో యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రానికి ఉత్తమ అవార్డు లభించిందన్నారు. నాణ్యమైన విత్తనాలు, భూసార ఆఽధారిత ఎరువుల యాజమాన్యం, నారు, మొక్కలు పెంచే సదుపాయం విస్తరణ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కేవీకేలో డెమో యూనిట్ల నిర్వహణకు ఈ అవార్డు లభించినట్లు తెలిపారు. వైస్‌ చాన్సలర్‌ అవినాశలింగం, డాక్టర్‌ భారతి, హరిశంకర్‌, డాక్టర్‌ శివనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:13 AM