Share News

ఉపాధి కూలీలకు ప్రయోజనం

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:09 AM

: మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభు త్వం రద్దుచేసింది.

ఉపాధి కూలీలకు ప్రయోజనం

100 నుంచి 125 రోజుల పని దినాలు

కనీస వేతనం రూ.240

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభు త్వం రద్దుచేసింది. దాని స్థానంలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ - గ్రామీణ్‌ పేరుతో కొత్త బిల్లుకు లోక్‌సభలో ఆమోదం తెలిపింది. ఈబిల్లు అమలులోకి వస్తే గ్రామాల్లోని రైతులు, కూలీలకు గతంలో కంటే ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న పథకంలో కూలీలకు పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు. రోజూ అందించే కనీస వేతనాన్ని (కూలి)ని రూ.240కు పెంచారు. మరింతగా గ్రామాల్లో మౌలిక వసతులు, రైతులు, రైతు కూలీలకు జీవనోపాధి పెంచేందు కోసం బడ్జెట్‌ను రూ.1.51 లక్షల కోట్లను కేటాయించారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభు త్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరించాలని నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక బారం పడనుంది.

మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే..

కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీరామ్‌జీ బిల్లుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర మంత్రి శివారజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. మహాత్మా గాంధీ సిద్దాంతాలకు అనుగుణంగానే ఎన్‌డీఏ ప్రభుత్వం గ్రామాల అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైందని సమాధానం ఇచ్చారు.

మరింత ఉపాధి

కేంద్రం కొత్తగా అమలులోకి తీసుకురానున్న పథకంలో రైతులకు, కూలీలకు మరింత ఉపాధి లభించనుంది. కనీ స వేతనాన్ని రూ.240కు పెంచారు. ఇప్పటి దాకా 100 రోజుల పనులు కల్పిస్తుండగా. ఇక ుంచి 125రోజుల పని దినా లుంటాయి.

వెంకటరమణయ్య, పీడీ, డ్వామా, కర్నూలు

ఆర్థిక భరోసా ఇచ్చేందుకు..

ఉపాధి హామీ పథకానికి వంద రోజుల పని ఉండేది. కొత్త పథకంలో ఆర్థిక భరోసా అందించేందుకు పని దినాలను 125 రోజులకు పెంచారు. కూలీలకు అదనంగా 25 రోజులు ఉపాధి లభిస్తుంది. ఈ కొత్త స్కీం ప్రకారం వ్యవసాయ పనులు జరిగే సమయంలో ఉపాధి పనులు చేపట్టరు. ముందుగా విత్తనాలు వేసే సమయంలో, ఆ తర్వాత పంట కోత సమయంలో కూలీల కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఉపాధి హామీ పనులను 60రోజుల పాటు నిలిపివేస్తారు. కొత్త సంవత్సరంలో 60 రోజుల మినహాయించి మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు కల్పిస్తారు. మహాత్మా గాంధీ స్కీమ్‌లో కూలీల వేతనాలను పూర్తిగా కేంద్రమే భరించేది. కొత్త పథకంలో కేంద్రం 60 శాతం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌ను భారీగా పెంచింది. గతంలో ఈ పథకం అమలుకు రూ.86వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త పథకం అమలు కోసం రూ.1.51 లక్షల కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 10లక్షల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. వేతనాలు, పనుల కల్పన కోసం రెండు జిల్లాలో రూ.600 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని నీటి యాజమాన్య సంస్థ అధికారులు తెలిపారు.

Updated Date - Dec 26 , 2025 | 12:09 AM