Share News

రమణీయం.. రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకీ ఉత్సవం

ABN , Publish Date - May 16 , 2025 | 12:34 AM

మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.

రమణీయం.. రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకీ ఉత్సవం
స్వర్ణ పల్లకిలో విహరిస్తున్న రాఘవేంద్రస్వామి

మంత్రాలయం, మే 15(ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. శ్రీమఠంలో రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం వైశాఖ తదియ శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాఽధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మఠం పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి రమణీయంగా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు మంగళవాయిద్యాలు మధ్య శ్రీమఠం ప్రాంగణం చుట్టూ ఊరేగుతున్న దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఊంజలసేవ చేసి హారతులు ఇచ్చారు. పీఠాధిపతి భక్తులకు ఫల, పుష,్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామికి విశేషపూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:34 AM