Share News

రమణీయం.. మాళమల్లేశ్వరుడి రథోత్సవం

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:00 AM

దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రమణీయం.. మాళమల్లేశ్వరుడి రథోత్సవం
దేవరగట్టులో కొనసాగుతున్న మాళ మల్లేశ్వర స్వామి రథోత్సవం

దేవరగట్టుకు పోటెత్తిన భక్తజనం

పోలీసుల భారీ బందోబస్తు

హొళగుంద, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బన్ని ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం బిలేహాల్‌ గ్రామస్థులు మేటి కుంభంతో రావడంతో రథోత్సవం ప్రారంభమైంది. రాత్రి మాళమల్లేశ్వర స్వామివారికి నెరణికి గ్రామ పురోహితులు పంచామృతము, రుధ్రాభిషేకము, బండారార్చన, రథసంస్కారము, రథాంగ హోమం వంటి ప్రత్యేక పూజలను చేశారు. మాళమల్లేశ్వర స్వామివారి విగ్రహాలను రథంపై ఉంచి ఎదరు బసవన్న గుడి వరకు వైభవంగా నిర్వహించారు. రథోత్సవంలో గొరవయ్యల నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. స్వామివారి రథోత్సవంను తిలకించేందుకు ఆంరఽధా, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఊ రవిశంకర్‌ రెడ్డి, హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, తుగ్గలి, వెల్దుర్తి ఎస్‌ఐలు దిలీప్‌ కుమార్‌, మారుతీ, శ్రీనివాసులు, బాల నరసింహులు, అశోక్‌తో పాటు 47 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 05 , 2025 | 12:00 AM