సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:28 AM
సైబర్ నేరాలపై అప్రమ త్తంగా ఉండాలని డోన డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు సూచించారు.
బనగానపల్లె, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలపై అప్రమ త్తంగా ఉండాలని డోన డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. శుక్రవా రం రాత్రి బనగానపల్లె పోలీస్‌స్టేషన ఆవరణలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొజెక్టర్ ద్వారా మహిళలపై జరిగే అఘాయిత్యా లు, బాలిక సంరక్షణ, ఫొక్సో చట్టం, సైబర్ క్రైం, రహదారి భద్రతా నియ మాలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులనుంచి వచ్చే లింకులపై క్లిక్ చేసేటపుడు, డౌనలోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఏవైనా ప్రమాదాలు రహ దారిపై జరిగితే 100, 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. కార్యక్రమంలో బనగానపల్లె సీఐలు ప్రవీణ్‌కుమార్, మంజు నాథరెడ్డి, ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, కల్పన, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.