క్షయ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:46 PM
క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినం పురస్కరించుకుని కలెక్టరేట్ ఎదుట ర్యాలీని జేసీ, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ, జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎల్. భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు.
జాయింట్ కలెక్టర్ నవ్య
కర్నూలు హాస్పిటల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినం పురస్కరించుకుని కలెక్టరేట్ ఎదుట ర్యాలీని జేసీ, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ, జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎల్. భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్షయను ముందుగానే గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడాల న్నారు. మధుమేహం, రక్తపోటు, పొగ, మద్యం తాగేవారు, కాలుష్య ప్రాంతాల్లో పని చేసేవారు గతంలో వ్యాధికి గురైన వారిని గుర్తించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి, జిల్లా క్షయ నివారణ రిటైర్డు అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, ఎన్‌జీవో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.