సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:47 PM
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. డివిజన్‌లో సీజనల్ వ్యాధులు ప్రబలి రోగులు అధిక సంఖ్యలో ఆదోని ఏరియా ఆసుపత్రికి వచ్చారన్న సమాచారం మేరకు సబ్ కలెక్టర్ గురువారం ఆసుపత్రిని తనిఖీ చేశారు.
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని రూరల్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. డివిజన్‌లో సీజనల్ వ్యాధులు ప్రబలి రోగులు అధిక సంఖ్యలో ఆదోని ఏరియా ఆసుపత్రికి వచ్చారన్న సమాచారం మేరకు సబ్ కలెక్టర్ గురువారం ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగుల వద్ద వెళ్ళి వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరా నగర్ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రోగులకు స్థానికంగా ఉన్న అర్బన్, పీహెచ్‌సీల్లో వైద్యసేవలు ఎందుకు అందించడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి అర్బన్, పీహెచ్‌సీల్లో వైద్యం అందించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కలెక్టర్ వెంట సూపరింటిండెంట్ డాక్టర్ పద్మకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి..
ఆదోని: పట్టణంలో ఆదివారం నిర్వహించ నున్న గణేష్ నిమజ్జనానికి పగడ్బందీగా ఏర్పాట్లుచేయాలని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ సూచించారు. గురువారం పట్టణంలో రహదారులను పరిశీలించారు. విగ్రహాల ఊరేగింపులో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గుంతలకు ప్యాచ్ వర్క్‌లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కాలువ వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచే యాలని సూచించారు. డీఎస్పీ హేమలత, తహసీల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్‌అండ్‌బీ ఈఈ పద్మనాభరెడ్డి ఉన్నారు.