Share News

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:14 PM

వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు

శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు

నంద్యాల కల్చరల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దోమలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు మంచినీటి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నందుటీడీఎస్‌ తనిఖీ చేయాలన్నారు. దేవసాఽ్ధనం వైద్యశాలలో అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉం చుకోవాలన్నారు. ఆయా మందుల ఇండెంటే ముందస్తుగానే వైద్యశాల విభాగాధికారికి అందజేయాలని దేవస్ధానంలో విధులు నిర్వహిస్తున్న అపోలో డాక్టర్లును ఆదేశించారు. ప్రధానకూడళ్లలో తగు అవగాహన బోర్డులను ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దేవసాఽ్ధనం అన్ని విభాగాలు, దేవస్ధానం వైద్యశాల సిబ్బంది, మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది అందరూ కూడ సమన్వయంతో విధులు నిర్వర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. దేవస్ధానం ఇంజనీర్లు, సంబందిత శాఖల ఉద్యోగులు, ఆరోగ్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:14 PM