Share News

అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:57 PM

జిల్లాలో వర్షాల కార ణంగా అంటువ్యాధులు ఎక్కువగా వ్యాప్తిచెందుతున్నాయని, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఆర్‌. వెంకటరమణ అన్నారు.

అంటువ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో వెంకటరమణ

డీఎంహెచ్‌వో వెంకట రమణ

నంద్యాల హాస్పిటల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాల కార ణంగా అంటువ్యాధులు ఎక్కువగా వ్యాప్తిచెందుతున్నాయని, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఆర్‌. వెంకటరమణ అన్నారు. మంగళ వారం జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, నోడల్‌ అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించాలని అవసరమైతే జిల్లా కేంద్రానికి సమాచారం ఇవ్వాలన్నారు. డీపీవో నజీని మాట్లాడుతూ గర్భిణులను నమోదు చేయడంలో జిల్లా వెనకబడి ఉందని, తక్కువ శాతం నమోదుచేసిన వారికి త్వరలో మెమో జారీచేస్తామన్నారు. జిల్లా గణాంక అధికారి సుజాత మాట్లాడుతూ హెచ్‌ఎంఐఎస్‌, సీఎస్‌ఎస్‌ఎం, సీఆర్‌ఎస్‌, సీడీ-ఎన్‌సీడీ, రిపోర్ట్స్‌, స్వర్ణాంధ్ర-2047 కేపీఐ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ఎలాంటి తప్పుల్లేకుండా ప్రతి నెలా 1నుంచి 5వ తేదీలోపు అన్ని పోర్టల్స్‌లో అప్‌లోడ్‌ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. కాంతారావు నాయక్‌, టీబీ, లెప్రసీ జిల్లా అధికారి డా. శారదాబాయి, సంచార చికిత్స ప్రోగ్రాం అధికారి డా.కె. జగదీష్‌చంద్రారెడ్డి, పీఎంకేవై అధికారి డా. రూపేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:57 PM