Share News

దేశానికే ఆదర్శం కండి

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:11 AM

ఓర్వకల్లు పొదుపు మహిళలు మహిళా బ్యాంకులో వాటాదారులుగా చేరి దేశానికే ఆదర్శంగా నిలవాలని పొదుపులక్ష్మి మండల సమాఖ్య గౌరవ సలహాదారాలు విజయభారతి సూచించారు.

దేశానికే ఆదర్శం కండి
సమావేశంలో మాట్లాడుతున్న విజయభారతి

బ్యాంకులో వాటాదారులుగా చేరండి

నెలకు రూ.5వేలు చెల్లించండి..

పొదుపు మహిళలతో ఓర్వకల్లు మండల సమాఖ్య

గౌరవ సలహాదారురాలు విజయభారతి

ఓర్వకల్లు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు పొదుపు మహిళలు మహిళా బ్యాంకులో వాటాదారులుగా చేరి దేశానికే ఆదర్శంగా నిలవాలని పొదుపులక్ష్మి మండల సమాఖ్య గౌరవ సలహాదారాలు విజయభారతి సూచించారు. సోమవారం ఓర్వకల్లులోని మండల సమాఖ్య శిక్షణా భవనంలో మండల మహిళా సమాఖ్య మహిళా బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విజయభారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని విజయభారతి ప్రారంభించారు. ప్రతి సంఘం మహిళా బ్యాంకులో వాటాదా రులుగా చేరి నెలకు రూ.5వేలు చెల్లించినట్లయితే.. మహిళలు బ్యాంకు హక్కుదారులుగా మారి రుణాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికి 475 సంఘాలు వాటాదారులుగా నమోదు చేసుకున్నాయన్నారు. లీడర్లు, మహిళా బ్యాంకు బోర్డు డైరెక్టర్లు, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 01:12 AM