కుటుంబాలతో ఆనందంగా గడపండి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:41 AM
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ కుటుంబాలతో ఆనందంగా గడపాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
పదవీ విరమణ పొందిన డీఎస్పీ, ఏఎస్‌ఐ
కర్నూలు క్రైం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ కుటుంబాలతో ఆనందంగా గడపాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఆర్ముడు రిజర్వుడు డీఎస్పీ కే.భాస్కర్‌రావును, వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ శివరామిరెడ్డిని ఎస్పీ శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసిన పదవీ విరమణ పొందడం అభినందనీయ మన్నారు. ఏమైనా సమస్యలుంటే తనను నేరుగా సంప్రదించా లన్నారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ హుశేన్‌పీరా, కర్నూలు డీఎస్పీ జే.బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, శివశంకర్, గుణశేఖర్‌బాబు, వేణుగోపాల్, ఆర్‌ఐలు జావేద్, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.