ధైర్యంగా ఉండండి
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:16 PM
హెచ్ ఐవీతో జీవిస్తున్నవారు ధైర్యంగా ఉండాలని, మందులతో జీవితకాలం పెంచుకోవచ్చని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
హెచ్‌ఐవీ బాధితులతో కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : హెచ్ ఐవీతో జీవిస్తున్నవారు ధైర్యంగా ఉండాలని, మందులతో జీవితకాలం పెంచుకోవచ్చని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే -2025 సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్ నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష, అపోహలు తగదని అన్నారు. హెచ్‌ఐవీ ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని, రోగులు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ లలిత, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.