Share News

వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:38 PM

వినియోగదారుల హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ చైర్మన్‌ కరణం కిషోర్‌ కుమార్‌ తెలిపారు.

వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలి
విద్యార్థులతో కమిషన్‌ చైర్మన్‌ కరణం కిషోర్‌ కుమార్‌

కమిషన్‌ చైర్మన్‌ కె.కిషోర్‌ కుమార్‌

కర్నూలు లీగల్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ చైర్మన్‌ కరణం కిషోర్‌ కుమార్‌ తెలిపారు. ఎమ్మిగనూరు డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళ వారం తమ పాఠ్యాంశంలో భాగంగా కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పలు వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయన్నారు. వాటిలో సేవాలోపం ఉంటే బాధిత వినియోగదారుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి తగిన పరిహారాన్ని పొందవచ్చని తెలిపారు. అందు కోసం వినియోగదారుల హక్కులను తెలుసుకుని విద్యార్థులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు నారాయణరెడ్డి, న్యాయవాది అనుదీప్‌రెడ్డి, శ్యాంసన్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:38 PM