బీసీ గురుకుల పాఠశాల తనిఖీ
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:15 AM
వెల్దుర్తిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు.
నాణ్యత లేని సరుకులపై మంత్రి సవిత ఆగ్రహం
వెల్దుర్తి టౌన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సరుకులు నాణ్యత లేకపో వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆమె పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠశాలకు సొంత భవనం, మైదానం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు ఆమె స్పందిస్తూ ఈ విషయంపై పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తమ దృష్టికి తెచ్చారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆమె స్టోర్ రూంను పరిశీలించారు. అందులో ప్రతి వస్తువు నాణ్యత లోపించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులకు అందించే గుడ్డు కేవలం పూర్తి చిన్న సైజు ఉండటంతో ఆమె స్వయంగా గుడ్లను తూకం వేశారు. 40గ్రాముల గుడ్డు రావడంతో గుడ్లతో పాటు సరుకులను పరీక్షకు పంపించాలని మంత్రి సవిత పీఏకు సూచించారు. అలాగే స్టాఫ్ రిజిస్టర్, గోడౌన్ స్టాక్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇందుకు ఆమె రిజిస్టర్ బుక్‌లో కంప్లైంట్ రాశారు. కళాశాలలోని ప్రతి వస్తువును, ప్రతి రూమ్‌ను, భోజనాలను క్షుణ్ణంగా పరిశీలీంచారు. అనంతరం స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్‌గౌడు, బొమ్మిరెడ్డిపల్లె సుబ్బ రాయుడుతో మాట్లాడుతూ స్థానిక టీడీపీ లీడర్లు పాఠశాలపై దృష్టి సారించాలని, వాటి వల్ల నిర్వహణ అభివృద్ధి చెందుతుందని సూచించారు.