బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:38 AM
నగరంలోని కర్నూలు క్లబ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన భూషణ్‌రావు స్మారక బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ శుక్రవారం ప్రారంభించారు
క్రీడల అభివృద్ధికి సహకరిస్తా : టీజీ వెంకటేశ్
కర్నూలు స్పోర్ట్స్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):నగరంలోని కర్నూలు క్లబ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన భూషణ్‌రావు స్మారక బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ శుక్రవారం ప్రారంభించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా, జిల్లా క్రీడల అభివృద్ది అధికారి భూపతిరావు, సందీప్ పాల్గొన్నారు. టీజీ వెంకటేశ్ క్రీడా రంగానికి భూషణ్‌రావు చేసిన సేవలను కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలు క్రీడా రంగం అభివృద్దికి తన సహకారం నిరంతరం ఉంటుందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకున్నానని చెప్పారు. విద్యార్థులు పోటీ తక్కువగా ఉన్న క్రీడలను ఎంచుకుని కష్టపడి సాధన చేసి ఆ క్రీడల్లో ఉన్నత స్థాయి చేరుకోవచ్చన్నారు.