Share News

బార్‌ లైసెన్సీ ప్రక్రియ పూర్తి

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:25 PM

బార్‌ నూతన లైసెన్సీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 26బార్లకు కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీచేయగా రెండు విడతల్లో 24 బార్లకు లైసెన్సు జారీ ప్రక్రియ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.

బార్‌ లైసెన్సీ ప్రక్రియ పూర్తి
లాటరీ పద్దతిన బార్లకు ఎంపిక చేసిన ఇన్‌చార్జి కలెక్టర్‌ నవ్య

దరఖాస్తుల ద్వారా రూ.5.15 కోట్లు ఆదాయం

26 బార్లలో 24 బార్లకు లైసెన్సులు జారీ

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): బార్‌ నూతన లైసెన్సీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 26బార్లకు కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీచేయగా రెండు విడతల్లో 24 బార్లకు లైసెన్సు జారీ ప్రక్రియ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.హనుమంతరావు, సూపరింటెండెంట్‌ ఎం.సుధీర్‌ బాబు ఆధ్వర్యంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ బి.నవ్య చేత లాటరీ పద్థతిన ఎంపిక చేయించారు. 24 బార్లకు దరఖాస్తుల ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం సమకూరింది. ఎమ్మిగనూరు, గూడూరుల్లో రెండు బార్లకు లైసెన్సు కోసం ఎవరూ దరఖాస్తులు చేసుకోకపోవడంతో వాటి ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. లాటరీ ప్రక్రియన ఎంపికైన దరఖాస్తు దారులు వెంటనే ఆరో వంతు లైసెన్సు రుసుం చెల్లించారు. అడిషనల్‌ ఆర్‌ఈటీ మొత్తాన్ని చెల్లించిన వారికి ప్రొవిజనల్‌ లైసెన్సు తాత్కాలిక లైసెన్సు మంజూరు చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి అయ్యాక బారు ప్రదేశాన్ని తనిఖీ చేసి శాశ్వత లైసెన్సులను మంజూరు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ ఏఈఎ్‌సలు రాజశేఖరగౌడ్‌, రామకృష్ణారెడ్డి, సీఐలు రాజేంద్ర ప్రసాద్‌, చంద్రహాస్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 11:25 PM