హెబ్బటం గ్రామంలో ఎద్దుల బండిపై డ్రమ్ముల ద్వారా నీరు తీసుకెళ్తున్న ప్రజలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:30 AM
మండలంలోని హెబ్బటం గ్రామంలో వారం నుంచి తాగునీరు రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.
హొళగుంద, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హెబ్బటం గ్రామంలో వారం నుంచి తాగునీరు రావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామ శివారులోని పంప్‌హౌస్ సంపు వద్దకు వెళ్లి ఎడ్ల బండిపై డ్రమ్ములు, తోపుడుబండ్లు, సైకిళ్ల ద్వారా నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయితీ అధికారి రాజశేఖర్ గౌడ్‌ను వివరణ కోరగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.