65 ఎకరాల్లో నేలకూలిన అరటి చెట్లు
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:23 PM
గత మూడు రోజుల నుండి వీచిన ఈదురుగాలులకు మహానంది మండలంలో 65 ఎకరాల్లో అరటిపంటకు నష్టం జరిగిందని జిల్లా ఉద్యానవన శాఖాధికారి నాగరాజు తెలిపారు.

మహానంది, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): గత మూడు రోజుల నుండి వీచిన ఈదురుగాలులకు మహానంది మండలంలో 65 ఎకరాల్లో అరటిపంటకు నష్టం జరిగిందని జిల్లా ఉద్యానవన శాఖాధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎం. తిమ్మాపురం, బుక్కాపురం, మహానంది సమీపంలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు నేలకూలిన అరటితోటలను ఆయన పరిశీలించారు. ఇప్పటికే పంట నష్టం పరిహారం కోసం ఉన్నతాధికార్లకు నివేదికలను పంపించామని అన్నారు.