Share News

వెదుర్ల అక్రమ రావాణా

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:11 AM

నల్లమల అడవిలో వెదురు అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు దాడి చేపట్టారు. ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన రెండు వాహనాలకు ఒకే వాహనాలకు ఒకే నెంబర్‌ ఉండటం గమనార్హం.

వెదుర్ల అక్రమ రావాణా
గాజుల పల్లె డిపోలో సీజ్‌చేసిన వాహనంఅదే నంబర్‌తో పచ్చర్లలో మరో వాహనం

నల్లమలలో అటవీ శాఖాధికారుల దాడులు

పట్టుబడిన వాహనం ఫ రెండు వాహనాలకు ఒకే నెంబర్‌

రుద్రవరం,సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నల్లమల అడవిలో వెదురు అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు దాడి చేపట్టారు. ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన రెండు వాహనాలకు ఒకే వాహనాలకు ఒకే నెంబర్‌ ఉండటం గమనార్హం. రుద్రవరం ఫారెస్టు సబ్‌డివిజన్‌ పరిధిలో చలమరైంజ్‌ పచ్చర్ల బోగదా మధ్య నాలుగు రోజుల కిందట మొబైల్‌ పార్టీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో వెదురులతో పాటు వాహనం కూడా పట్టుకున్నారు. సుమారు 45 రోజుల క్రితం రుద్రవరం మండలం ఎల్లావత్తుల గ్రామ సమీపంలో మొబైల్‌ పార్టీ అధికారుల దాడిలో మరో వాహనం వెదురులతో పట్టుబడింది. ఎల్లా వత్తుల గ్రామ సమీపంలో పట్టుబడిన వాహనాన్ని గాజులపల్లె కలప డిపోకు తరలించారు. అటవీ ప్రాంతంలో పచ్చర్ల, బోగదా మధ్య పట్టుబడిన వాహనం ఏకో టూరిజం వద్ద ఉంచారు. ఈ రెండు వాహనాలకు ఏపీ 37టీఏ6567 నెంబర్లను కలిగి ఉన్నాయి.

Updated Date - Sep 03 , 2025 | 12:12 AM