అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:50 AM
ప్రజలు అవయ వదానంపై అవగాహన పెంచుకోవాలని, మరణం అనంతరం 6, 7 మందికి ప్రాణదానం చేయవచ్చని కర్నూలు జీజీహెచ్ సూపరింటెం డెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
22 ఏళ్ల యువకుడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలు అవయ వదానంపై అవగాహన పెంచుకోవాలని, మరణం అనంతరం 6, 7 మందికి ప్రాణదానం చేయవచ్చని కర్నూలు జీజీహెచ్ సూపరింటెం డెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన చాంబరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన 22 ఏళ్ల గుర్రం గిరిధర్‌కు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను నెప్రాలజీ, యురాలజీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారన్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్తబనకచర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జూలై 9వ తేదీ కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో చేరగా 16వ తేదీన బ్రెయిన్ డెడ్ అయ్యాడని వివరించారు. బ్రెయిన్ డెడ్ అయిన రోగికి జీవన్‌ధాన్ వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్ చేయించుకున్న దేవనకొండ మండలం కరివే ములకి చెందిన 22 ఏళ్ల గుర్రం గిరిధర్‌కు అదే నెల కర్నూలు జీజీహె చ్‌లో అడ్మిషన్ చేయించుకుని 17వ తేదీ కిడ్నీ మార్పిడిని వైద్యులు నిర్వహించారు. యురాలజీ హెచ్‌వోడీ డా.ముత్యాశ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బాలరవితేజ, నెఫ్రాలజీ హెచ్‌వోడీ డా.అనంతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.వెంకట పక్కిరెడ్డి, డా.శ్రీధర్‌శర్మ అనస్థీషియా హెచ్‌వోడీ డా.విశాల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనా సుపత్రుల్లోనే మొట్టమొదటిసారిగా కర్నూలు జీజీహెచ్‌లో ఐదు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారని, వైద్యారోగ్య శాఖ మంత్రి నుంచి ప్రశంసలు అందినట్లు ఆయన తెలిపారు. నెఫ్రాలజీ సీనియర్ వైద్య నిపుణురాలు డా.పిఎన్ జిక్కి, అనస్థీషియా ప్రొఫెసర్ డారామశివ నాయక్, సీఎస్‌ఆర్‌ఎంవో టీసీహెచ్ వెంకటరమణ పాల్గొన్నారు