Share News

క్షయ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:16 AM

క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కర్నూలు డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు.

క్షయ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి
పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్న జీజీహెచ సూపరింటెండెంట్‌, డీఎంహెచవో

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కర్నూలు డీఎంహెచవో డాక్టర్‌ పి.శాంతికళ అన్నారు. క్యూబ్‌ రూట్స్‌ ఫౌండేషన ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌ భారత అభియాన కార్యక్రమంలో భాగంగా 100 మంది టీబీ బాధితులకు పోషకాహార పంపిణీ కార్యక్రమాన్ని కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు, ఇనచార్జి ప్రిన్సిపాల్‌ డా.సాయిసుధీర్‌, డిస్ర్టిక్ట్‌ టీబీ ఆఫీసర్‌ డా.ఎల్‌.భాస్కర్‌ ఫౌండేషన సీని యర్‌ ఎగ్జిక్యూటీవ్‌ కే.రాంబాబు సీనియర్‌ ఇంజనీర్‌ ఎం.దినేష్‌ రెడ్డి ప్రారంభించారు. డీఎంహెచవో మాట్లాడుతూ జిల్లాను క్షయ రహితం గా రూపొందించమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. డీఎస్‌ఎంవో డా. మల్లికార్జున రెడ్డి, డా.మనోహర్‌ రెడ్డి, టీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 12:16 AM