ఆర్వోఆర్ చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:31 PM
ఆర్వోఆర్ చట్టంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి అని కలెక ్టర్ రంజిత్‌బాషా రెవెన్యూ అధికారులకు సూచించారు.

రీ సర్వేలో తప్పులు చేయకండి.. కలెక్టర్ పి. రంజిత్‌బాషా
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఆర్వోఆర్ చట్టంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి అని కలెక ్టర్ రంజిత్‌బాషా రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులకు రెవెన్యూ అంశాలపై వర్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని భూ సమస్యలపై 14వ తేదీలోపు పంపితే వాటిని సీసీఎల్‌ఏకు పంపుతామని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, మ్యూటేషన్‌కు సంబంధించి పెండింగ్ ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. సర్వేలో తప్పులు చేయకూడదని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్వ మాట్లాడుతూ పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన సమస్యల్ని రీ ఓపెన్ కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని తహసీల్దార్లకు ఆదేశించారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ వెంకట నారాయణమ్మ, ఆర్‌డీఓలు సందీప్ కుమార్, భరత్ నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.